Monday 15 July 2024

 

ట్రావెన్ కోర్ మహారాజా ఆయిల్యం తిరునాళ్ రామవర్మ IV :

ఆయిల్యం తిరునాళ్ రామవర్మ 1860 నుండి 1880 వరకు భారతదేశంలోని ట్రావెన్‌కోర్ సంస్థానానికి మహారాజుగా పాలించారు. ఆయిల్యం  తిరునాళ్ రామవర్మ 1832 మార్చి 14న రామ వర్మ కొయిల్ తంపురన్ తిరువళ్ల పలియక్కర రాజా, రాణి గౌరీ రుక్మిణి దేవి వారికి జన్మించారు. ఈయన ను ఆయిల్యం తిరునాళ్ రామ వర్మ మరియు ఆయిల్యం తిరునాళ్ మహారాజా ఆయిల్యం గా పిలవబడేవారు. రుక్మిణీ బాయికి పుట్టిన ఏడుగురు పిల్లలలో రాణి లక్ష్మీ బాయి అనే కుమార్తెతో సహా నలుగురు మాత్రమే జీవించారు. అలాగే పెద్ద కొడుకుమూడో కొడుకు మానసిక అనారోగ్యం కారణంగా పాలనకు అనర్హులుగా ప్రకటించారు.

తిరునాళ్ యొక్క ప్రారంభ విద్య ప్రైవేటుగా అందించబడింది. 1848లో మాధవరావు అతనికి మరియు అతని సోదరునికి  బోధకుడు గా నియమించబడ్డాడు. 1857లో మాధవరావును దివాన్‌గా నియమించారు.

1854లో ఆయిల్యం తిరునాళ్ తిరువత్తరు అమ్మవీట్‌కి చెందిన తన మామ కూతురు పణిల్లై మాధవి పిళ్లై లక్ష్మీ పిళ్లై  వివాహం చేసుకున్నారు.1860లో ఆయిల్యం తిరునాళ్ రామవర్మ ట్రావెన్‌కోర్ సంస్థానానికి మహారాజు అయ్యారు.అతని మొదటి భార్య తిరువత్తరు అమ్మాచి కొన్నేళ్ల తర్వాత మరణించారు.ఆమె మరణించిన తరువాతమహారాజు 1862లో తిరిగి పొరుగు రాష్ట్రమైన కొచ్చిన్‌లోని ప్రతిష్టాత్మక కుటుంబమైన మాతృప్పిల్లిల్‌కు చెందిన కల్యాణికుట్టి అమ్మను మళ్లీ వివాహం చేసుకున్నారు వివాహం చేసుకున్నారు. ఆమె 1839లో కొచ్చిన్ మాజీ దివాన్ అయిన నదవరంబాతు కుంజు కృష్ణ మీనన్ మరియు అతని భార్య మాతృప్పిల్ లక్ష్మి అమ్మల ఏకైక కుమార్తె.

కళ్యాణికుట్టి అమ్మ ప్రఖ్యాత అందం కలిగిన మహిళ మరియు ఆయిల్యం తిరునాళ్ రాజా రవివర్మకు ఇచ్చిన మొదటి ప్రతిఫలం ఆమె చిత్రపటానికే. 


ఈ చారిత్రాత్మక చిత్రానికి బదులుగా ఆయిల్యం తిరునాళ్ వారు రాజా రవివర్మకు 2001 బంగారు నాణేలు500 క్వింటాళ్ల ఎండుమిర్చి100 క్వింటాళ్ల యాలకులు మరియు 100 క్వింటాళ్ల ఎండిన అల్లం బహుమతిగా ఇచ్చాడు.

మహారాజా ఆయిల్యం తిరునాళ్ యొక్క పాలన ట్రావెన్‌కోర్‌లో కొత్త శకానికి నాంది పలికింది. అతని దివాన్ మాధవరావు సహకారంతో ట్రావెన్‌కోర్‌లో అనేక సంస్కరణలుమార్పులను అమలు చేశాడు. ఇవన్నీ రాష్ట్రానికి అనుకూలంగా ఉండేవి.

ఈయన  పాలనలోని  విద్య చట్టం,  ప్రజాపనులు వైద్యం టీకాలు వేయడం మరియు  ప్రజారోగ్యం,  వ్యవసాయం మొదలైన వాటిలో గొప్ప అభివృద్ధి జరిగింది. మహారాజా ఆయిల్యం తిరునాళ్ రామవర్మ గారిని  బ్రిటిష్ ప్రభుత్వం అధికారికంగా మహారాజా ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఇండియా బిరుదును ప్రదానం చేసింది. తిరువనంతపురంలోని మహారాజా కళాశాల న్యాయ కోర్సును ప్రారంభించి , అలాగే  విద్యారంగంలో కూడా అనేక ప్రగతిని సాధించారు. మహారాజా ఆయిల్యం తిరునాళ్ వారి పాలనలోనే  1875లో  ట్రావెన్‌కోర్‌లో మొదటి అధికారిక జనాభా గణన జరిగింది.

మహారాజా ఆయిల్యం తిరునాళ్ రామవర్మ 30 మే 1880న మరణించారు.ఆయిల్యం తిరునాళ్ రామవర్మ వారి యొక్క పాలనపై  బ్రిటిష్ ప్రభుత్వ గెజిటీర్ ఆఫ్ ఫోర్ట్ సెయింట్ జార్జ్ మహారాజా ఆయిల్యం తిరునాళ్ రామవర్మ పాలనలో ట్రావెన్‌కోర్‌ను స్థానిక రాష్ట్రాలలో మొదటి స్థానంలో ఉంచి, తెలివైన మరియు జ్ఞానోదయమైన పరిపాలనా సూత్రాల అభివృద్ధి ద్వారా  పాలన  చేశారని వ్యాఖ్యానించింది  అంటే ఆయన యొక్క పాలన  ఎంత గొప్పగా ఉండేదో  వేరే  చెప్పుకోవాల్సిన అవసరం లేదు.

 

 

 

Ayilyam Tirunal Ramavarma ruled as the Maharaja of Travancore, India from 1860 to 1880. Ayilyam Tirunal Ramavarma was born on 14 March 1832 to Rama Varma Koil Tampuran Tiruvalla Paliakara Raja and Queen Gauri Rukmini Devi. He was known as Ayilyam Tirunal Rama Varma and Ayilyam Tirunal Maharaja Ayilyam. The seven children born to Rukmini Bai, only four survived, including a daughter named Rani Lakshmi Bai. Also, the eldest son and the third son were declared unfit to rule due to mental illness.

 

Tirunal's early education was provided privately. In 1848 Madhavrao was appointed as tutor to him and his brother. After that, Madhavrao was appointed Diwan in 1857.

In 1854, Ayilyam Tirunal married his uncle's daughter Panillai Madhavi Pillai Lakshmi Pillai of Tiruvattaru Ammaveet. In 1860 Ayilyam Thirunal Ramavarma became the Maharaja of Travancore. His first wife, Tiruvattaru Ammachi, died a few years later.

,

After her death, the Maharaja remarried in 1862 to kalyanikutty Amma, who belonged to a prestigious family in Mathirappilly in the neighbouring state of Cochin. She was the only daughter of Nadavarambathu Kunju Krishna Menon, former Diwan of Cochin in 1839, and his wife Mathirappilly Lakshmi Amma.

 

Kalyanikutty Amma was a woman of renowned beauty and her portrait was the first reward given to Raja Ravi Varma of Ayilyam Thirunal.

 

In return for this historic picture, Ayilyam Thirunal gifted Raja Ravi Varma with 2001 gold coins, 500 quintals of black pepper, 100 quintals of cardamom and 100 quintals of dried ginger.

 

The reign of Maharaja Ayilyam Tirunal ushered in a new era in Travancore. He implemented many reforms and changes in Travancore with the help of his Diwan Madhavrao. All these were in favour of the state.

 

Education, law, public works, medicine, vaccination and public health, agriculture etc. were greatly improved during his reign. Maharaja Ayilyam Tirunal Ramavarma was officially awarded the title of “Maharajah Order of the Star of India” by the British Government. Maharaja's College, Thiruvananthapuram started a law course and also made many strides in the field of education. It was during the reign of Maharaja Ayilyam Tirunal that the first official census of Travancore was conducted in 1875.

 

Maharaja Ayilyam Thirunal Ramavarma died on 30 May 1880. On the reign of Ayilyam Thirunal Ramavarma the British Government Gazetteer of Fort St. George commented that during the reign of Maharaja Ayilyam Thirunal Rama varma ruled Travancore by developing wise and enlightened principles of administration which meant that his rule was great. There is no need to say otherwise.

 


  ట్రావెన్ కోర్ మహారాజా   ఆయిల్యం తిరునాళ్ రామవర్మ IV  : ఆయిల్యం తిరునాళ్ రామవర్మ 1860 నుండి 1880 వరకు భారతదేశంలోని ట్రావెన్‌కోర్ సంస్థానా...